ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చలను అలంకరించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో అర్థరాత్రి నుంచే క్రీస్తు రాకకోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడువాలంటూ సందేశాలిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకనున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోయాయి. క్రైస్తవ సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
విజయవాడ నగరంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నీతి, నిజాయితీకి అందరూ కట్టుబడాలన్నారు. మదర్ థెరిస్సా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారన్నారు చంద్రబాబు.(feed ingest)
ఆసియాలోనే అతి పెద్దదైన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్రైస్తవులు చర్చికి తరలివచ్చారు. సికింద్రాబాద్ సెయింట్ మేరి బెసిలికా, మెదడిస్ట్ చర్చితో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ లు కట్ చేశారు.
కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున విదేశీ భక్తులు పాల్గొన్నారు. ఏసుక్రీస్తుకు కీర్తిస్తూ గీతాలు అలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. నెల్లూరులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ, కర్నూల్ లోని రాక్ హుడ్ చర్చిలో ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విశాఖ, చిత్తూరు. శ్రీకాకుళం, ఏలూరు పట్టణాల్లోనూ ఆనందోత్సవాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చర్చిలలో మిఠాయిలు, స్వీట్స్, కేక్స్ లను పంచుతూ ఒకరికొకరు కిస్టమస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.