ఆన్‌లైన్‌లో పామును ఆర్డర్ ఇచ్చిన ఓ యువతి.. ఆ పాము ద్వారానే ప్రాణాలు కోల్పోయింది. చైనా షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్ వైన్ తాగాలనిపించింది. అయినా స్నేక్ వైన్ ఏంటి..? దాన్ని తాగడం ఏంటని ఆశ్చర్యపోకండి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొన్ని ప్రాంతాల్లో పలురకాలుగా స్నేక్ వైన్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తాగుతారు. అలాగే స్నేక్ వైన్ తాగడంకోసం కొన్నిరోజుల కిందట ఆ యువతి ఈ కామర్స్ వెబ్‌సైట్ లో ఓ విష సర్పాన్ని ఆర్డరిచ్చింది. తన ఇంటికి వచ్చిన పామును వైన్ ఉన్న పాత్రలో వేసింది. అయితే ఆ పాము ఎలాగోలా తప్పించుకుని పాత్రనుంచి బయటకొచ్చింది. ఆపై విష సర్పం కాటువేయడంతో యువతిని మృతిచెందినట్లు ఆమె తల్లి తెలిపారు.