చైనా ఓపెన్ రెండోరౌండ్లోనే సైనాకు షాక్

Update: 2017-12-13 06:20 GMT

చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ రెండోరౌండ్లోనే భారత చాంపియన్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ ల పోటీ ముగిసింది. షాంఘై వేదికగా జరుగుతున్న 2017 చైనా సూపర్ సిరీస్ టోర్నీ రెండోరౌండ్ మహిళల సింగిల్స్ లో జపాన్ కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ప్లేయర్ యమాగుచి 21-18, 21- 11తో 11వ ర్యాంక్ సైనాను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో 11వ ర్యాంకర్ ప్రణయ్ పై చైనాకు చెందిన 53వ ర్యాంకర్ చిక్ యూ లీ 21-19, 21- 17తో కేవలం 42 నిముషాల పోరులోనే విజేతగా నిలిచాడు. మరో తొలిరౌండ్ పోరులో రెండో సీడ్ సింధు 24- 22, 23-21తో జపాన్ అన్ సీడెడ్ ప్లేయర్ సయాకో సాటోను చిత్తు చేసింది. రెండోరౌండ్లో కొరియా ప్లేయర్ హాన్ యూతో తలపడాల్సి ఉంది.

Similar News