కొందరు పక్కన కూర్చుంటే చాలు ఏదో తెలియని దుర్వాసన వస్తుంది. ఒక్కో శరీరానికి ఒక్కో విధమైన దుర్వాసన ఉంటుందని విన్నాం.. ఇక ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది.. దానికి తగిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
ముఖ్యంగా శరీరం నుండి దుర్వాసన రావడానికి గల కారణాల్లో వారి ఆహారపు అలవాట్లేనని వైద్య నిపుణులు చెబుతుంటారు.
*కొందరు వ్యక్తులు అధికమొత్తంలో మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన శరీరంలో సల్ఫర్ ఉత్పన్నమవుతుంది. అది చర్మ రంద్రాల ద్వారా బయటకు పంపబడుతుంది.ఈ క్రమంలో శరీరం దుర్వాసన రావడానికి అవకాశముంది.
*అలాగే ఎరుపు రంగు వుండే ఆహార పదార్ధం తిన్నప్పుడు అది జీర్ణమవడానికి ఎక్కువ శక్తీ కావలసి వస్తుంది. ఈ సమయంలో శరీరం నుంచి చెమట అధిక మొత్తంలో విసర్జింపబడుతుంది. దాంతో శరీరం నుండి దుర్వాసన వస్తుంది.
*అలాగే కొందరు అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవిస్తుంటారు.. దీనివలన కూడా చెమట ఎక్కువగా వస్తుంది. అది దుర్వాసనకు దారితీస్తుంది.
*జంక్ ఫుడ్ ఆరగించడం వలన శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. దీనిద్వారా కూడా అధిక మొత్తంలో చెమట వస్తుంది. అయితే ఇది లావు ఎక్కువగా ఉన్న వారిలో ఉంటుంది.
*అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన రక్తంలో కీటోన్స్ ఉత్పత్తి అవుతాయి.ఇవి కూడా శరీర దుర్వాసనకు కారణమవుతాయి.
*పాల ఉత్పత్తులు ఎక్కువమొత్తంలో తీసుకోవడం వలన శరీరంలో విడుదలయ్యే.. hidrozen salfied , mithyle morcapton వలన చెమట కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి దుర్వాసనకు కారణమవుతాయి.
*అలాగే సిగరెట్ తాగే వారిలో కూడా దుర్వాసన ఎక్కువగా వస్తుంది. సిగరెట్ పొగ స్వేద గంధ్రులతో కలిసి భరించలేని వాసన వచ్చేటట్టుగా చేస్తుంది. కాగా ఈ కారణాలతో శరీరంలో దుర్వాసన వస్తుంది.