ఏపీ కేబినెట్‌లో బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తన అధికారిక వాహనాన్ని, ఐడీ కార్డుని ప్రభుత్వానికి ఇచ్చేశారు. అసెంబ్లీలో సీఎం ఛంద్రబాబును కలసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని కామినేని ప్రకటించారు. బీజేపీని వీడేది లేదన్న కామినేని తుది శ్వాస వరకు బీజేపీలో ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏపీకి మంచిది కాదని వ్యాఖ్యానించారు.