టాలీవుడ్ ఇండస్ట్రీ కాపీ కంటెంట్ తో అష్టకష్టాలు పడుతుంది. కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తే చివరికి ఎవరో ఒకరు వచ్చి ఇది మా సినిమా నుంచి కాపీ చేశారంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కాపీ కంటెంట్ ఊబిలో కొరటల శివ డైరక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న భరత్ అను నేను చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
జమనాలో తెలుగు సినిమా వేరు. ఎక్కడ నుంచి ఏం కాపీ కొట్టి సినిమా తీసినా పట్టించుకునేవారు కాదు. పరిస్థితులు మారాయి. బాహుబలి పుణ్యమా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాల్లో ఏ చిన్న కాపీ కంటెంట్ దొరికినా ఉతికి ఆరేస్తున్నారు
అయితే ఇప్పుడు మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారనే టాక్ వినిపిస్తుంది. 1995లో అమెరికాలో విడుదలైన ది అమెరికన్ ప్రెసిడెంట్ సినిమాలో హీరో ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. రెండు బిల్లులను పాస్ చేసే విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతాడు. తరువాత ఎన్నికలు దగ్గరకు వస్తుంటాయ్. ఆ సమస్యలు నుండి హీరో ఎలా బయటపడ్డాడో అదే కథ. మరి భరత్ అను నేనుకి ది అమెరికన్ ప్రెసిడెంట్ కి దగ్గర పోలీకలు ఉండడంతో ఈ సినిమా కూడా కాపీ అనే రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమా కాపీనా లేదా ఒరిజనల్ కంటెంటా అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.