పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు టెయిలెండర్లు పోరాడడంతో 243 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్లోనే రాహుల్ డకౌటవగా.. విజయ్ 20 , పుజారా 4 , కోహ్లీ17, రహానే 30 పరుగులకు ఔటయ్యారు. రహానే (30), పంత్ (30), విహారి (28), విజయ్ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.ఓవర్ నైట్‌స్కోర్ 112/5 తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది. స్టార్క్, లయన్‌లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్ యాదవ్(2) , ఇషాంత్ శర్మ(0), షమీ(0) బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న ఈ పిచ్‌పై చివరిరోజు బ్యాటింగ్ చేయడం కష్టతరమైంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ఒకరితర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కాగా ఈ ఇన్నింగ్స్ లో నలుగురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ అవ్వడం విశేషం.