వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. డర్బన్ కింగ్స్ మీడ్ వేదికగా ముగిసిన తొలివన్డేలో అజింక్యా రహానేతో కలసి తనజట్టుకు 6 వికెట్ల అలవోక విజయం అందించాడు. కొహ్లీ 119 బాల్స్ లో 10 బౌండ్రీలతో 112 పరుగులు సాధించాడు. తన వన్డే కెరియర్ లో 203వ మ్యాచ్ లో విరాట్ 33వ శతకంతో ఈ ఘనత సాధించాడు. కఠినమైన డర్బన్ పిచ్‌పై అద్భుతమైన ఆటతీరుతో కోహ్లీ అందర్నీ ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌కు అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖులు కూడా ట్విటర్ ద్వారా కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భర్త సాధించిన శతకం బాలీవుడ్ హీరోయిన్ అనుష్కను కూడా ఫిదా చేసింది. ఆమె తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సెంచరీ అనంతరం.. కోహ్లీ ఫోటో పెట్టి దానిపై `100` అని రాసి లవ్ సింబల్స్ పెట్టింది. వెంటనే మరో ఫోటో పెట్టి `వాట్ ఏ గయ్` అని రాసింది.