గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం, బోరుపాలెం మధ్య బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డుకు చెందిన సైదారాజు కుటుంబం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణా నదిలో చేపలవేటకు వెళ్లింది. వీరు ప్రయాణిస్తున్న పడవ బోరు పాలెం, అబ్బురాజుపాలెం ఇసుక రీచ్ ల మధ్యలో డ్రెజ్జర్ ఢీకొని మునిగిపోయింది.
ఈ ఘటనలో సైదారాజు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా...ఆయన భార్య మాధవి, కూతురు కావ్య మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జాతీయ విపత్తు దళం మృత దేహాలను వెలికితీశారు. ఇసుక తోడేయడం వల్ల భారీగా గుంతలు ఏర్పడటంతో మృతదేహాలను బయటకు తీయడానికి కష్టపడాల్సి వచ్చింది.