కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో జరుగుతున్న సమావేశంలో.. వివిధ శాఖల పురోగతిపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలో శిల్పారామానికి 20 ఎకరాలు కేటాయిస్తామన్న చంద్రబాబు.. వాటి నిర్వహణ కూడా ఉత్తమంగా ఉండాలని సూచించారు.