‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ 2లో నేనూ యాక్ట్ చేస్తా కానీ..

Update: 2018-02-08 00:57 GMT

ష‌కీలా బాట‌లో తానుకూడా న‌డుస్తాన‌ని అంటోంది యాంక‌ర్ ర‌ష్మీ. నెటిజ‌న్ల‌తో మాట్లాడిన ఆమె అనేక‌ విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. 
కొద్దిరోజుల క్రితం అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి  ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.  ఈ సినిమాపై  మ‌హిళా సంఘాలు మండిప‌డ్డాయి. స్త్రీ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా డైర‌క్ట‌ర్ ఆర్జీవీ తెరకెక్కించాడంటూ కొన్ని చోట్ల దిష్ట‌బొమ్మ దగ్ధం చేశారు. ఈనేప‌థ్యంలో జీఎస్టీ-2లో తాను యాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శృంగార తార ష‌కీలా చెప్పుకొచ్చింది. 
వ‌ర్మ జీఎస్టీ  -2 లో యాక్ట్  చేయ‌మంటే చేస్తా. కానీ బ‌రువు త‌గ్గ‌మంటూ చెప్ప‌లేనంటూ న‌వ్వుతు సమాధానమిచ్చింది ఆమె.  మ‌హిళా సంఘాలు వ్యతిరేకత‌పై ..మహిళా సంఘాలకు పనీపాట ఏముండ‌దు. కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగినులు  ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్ల‌కు తెలుసా..? తెలుసుకొని ప్ర‌శ్నించారా అంటూ మండిప‌డింది. సినిమా ను సినిమా చూడాలే త‌ప్పా. సినిమాలు విడుద‌ల ఆపేయండి అంటూ మ‌హిళా సంఘాలు ఎక్కువ చేస్తున్నాయంటూ  కౌంట‌ర్ అటాక్ ఇచ్చింది.   
ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్ల ప్ర‌శ్నల‌కు స్పందించిన  ర‌ష్మీ తాను ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ 2 లో యాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపింది. అయితే డైర‌క్ట‌ర్ ఆర్జీవీ కాకుండా గ‌రుడ‌వేగ డైర‌క్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌త్తారు అయితే సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది. ఇక మొన్న అన‌సూయ‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై మీర‌న్నా అన‌సూయ‌కు కొంచెం చెప్పండి. మీ ఇద్ద‌రు స్నేహితుల‌కు క‌దా అన్న నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు ‘క్షమించండి.. నేను ఆమె సలహాదారుని కాదు’ అన్నారు. 
ఈ సంద‌ర్భంగా త‌నకు జ‌రిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ ను గుర్తు చేసింది. కాలేజీ చ‌దివే కుర్రాళ్లు నాతో సెల్ఫీ దిగాల‌ని ప్ర‌య‌త్నించారు.  నా కారును వెంబ‌డించారు. నా డ్రైవ‌ర్ వారిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నా..వారు న‌న్ను అనుసరిస్తూనే వచ్చారు. దీంతో తాను కారు దిగి వాళ్ల‌తో మాట్లాడే  ప్ర‌య‌త్నం చేశా. మాతో ఓ సెల్ఫీ దిగండి ఇక్క‌డి నుంచి వెళ్లిపోతాం అని ఆ న‌లుగురు కుర్రాళ్లు ఉన్నారు. అదే స‌మ‌యంలో పోలీసులు ఏ దైనా  ఏమైనా ఉందా?, సాయం కావాలా? అని అడిగారు.  వ‌ద్ద‌ని నన్ను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులకు ధన్యవాదాలు చెప్పాన‌ని తెలిపింది. 
సెల్ఫీల విష‌యంలో అన‌సూయ కంటే నేనే క‌టువుగా ప్ర‌వ‌ర్తిస్తా. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైన అనుసూయ ఆ బాబు ఫోన్ లాక్కునే అవ‌కాశం లేదు అని రష్మిట్వీట్ చేసింది. 

Similar News