ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని ఎంపిక చేస్తారని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. గోవా సీఎం మార్పు ఉండదని అయన తేల్చి చెప్పారు. అయితే త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టామని ఆదేశించినట్టు అమిత్ షా స్పష్టం చేశారు. కాగా సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో పాంక్రియాస్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందని.. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ప్రతిపక్షం.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కూడా రాష్ట్ర గవర్నర్ ను కోరుతోంది కాంగ్రెస్.