ప్రభుత్వ బ్యాంకులు కుంభకోణాలతో కుదేలవుతున్నాయి. ఇప్పటికే ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ స్కాం బట్టబయలైన విషయం తెలిసిందే. ఆ స్కాం మరిచిపోకముందే చెన్నైలో కనిష్క్ జ్యువెలరీ కోట్లలో కుంబకోణానికి పాల్పడింది. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆ సంస్థ యజమానులు పరారయ్యారు.
ఇదిలా ఉంటే హైదరబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేతలు రూ. 313 కోట్లకు ఎగనామం పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
1997 హర్యానాలోని గుర్గావ్ లో తొట్టెంపూడి సలలిత్ ఛైర్మన్ అండ్ ఎండీగా వ్యహరిస్తూ టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరిట కంపెనీని స్థాపించారు. రోడ్ల నిర్మాణం, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ లాంటి పలు ప్రాజెక్టులను టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపట్టేది. అంతేకాదు, ఎల్ అండ్ టి, ఆర్ఐటిఇఎస్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి పెద్ద కంపెనీలకు సబ్ కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించేది.
అయితే కంపెనీ అవసరాల నిమిత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. యూబీఐ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్యాంకుల కన్సార్టియం టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇంకా రూ. 1,394.43 కోట్లు చెల్లించాల్సివుంది. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ రుణ మొత్తాలను ఇతర బ్యాంకుల ఖాతాల్లోకి మళ్లించారు.
ఇతర బ్యాంకుల ఖాతాలకు సొమ్ము మళ్లించి... ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి రుణాల ద్వారా పొందిన సొమ్మును ఆ ఖాతాల్లోకి కంపెనీ ప్రమోటర్లు మళ్లించారు. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ సొమ్ము మళ్లించారు. ఆ తర్వాత బ్యాంకుకు రుణాలు చెల్లించకుండా చేతులెత్తేశారు. టొటెం రుణాలను 2012 జూన్ 30నే మొండి బకాయిలుగా బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. అంతేకాదు, ఈ కంపెనీ ప్రమోటర్లు తెలివిగా కంపెనీ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించారు.
అయితే టొంటె సంస్థ ను హైదరాబాద్ లో కూడా స్థాపించారు. తమ బ్యాంకునుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన ఆ సంస్థ సభ్యులు ..తీసుకున్న మొత్తాన్ని తిరిగి కట్టలేదని సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారు టొటెం అధినేతల ఇళ్లులో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఈ లావేదేవీల గురించి అధికారులు కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.