తన ఇంటిని షూటింగులకని చెప్పి వాడుకుని ఎన్నిరోజులకు ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని నటుడు విజయ్ కుమార్ కూతురిపై పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్ధరాత్రి అయన కూతురు నటి వనిత తండ్రికి ట్విస్ట్ ఇచ్చారు. తనను తండ్రి కిరాయి మనుషులతో కొట్టిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని.. విజయకుమార్ తనను ఇంట్లో ఉండొద్దని.. వెంటనే ఇల్లు ఖాళీ చేయించాల్సిందిగా మధురవాయిల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడని చెప్పింది. సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదని, అలాంటిది తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించింది. అందుకే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పింది.కానీ తనను ఉండొద్దని తండ్రి విజయ్ కుమార్ అంటున్నాడని ఆమె చెప్తూ.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అంతేకాదు వెళుతూ వెళుతూ.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వెళ్ళింది. విజయ్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇంటిని ఖాళీ చేయమని అన్నందుకు తన కూతురు రెచ్చిపోయి పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడికి దిగిందనీ.. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి పరారయిందని విజయ్ కుమార్ మళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇక దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.