ప్రతిభ ప్రదర్శించి.. అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న శ్రీదేవి హఠాన్మరణం పొందితే.. కనీసం సంతాప సభ కూడా నిర్వహించే తీరిక.. టాలీవుడ్ కు లేకపోవడంపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
శ్రీదేవి అంటే అభిమానం అనీ.. ఆమె మా కుటుంబ సభ్యురాలివంటిదనీ.. నా తోబుట్టువు లాంటిదనీ.. చెప్పడం కాదు. ఓ సభ పెట్టి.. సమావేశం పెట్టి.. పద్ధతి ప్రకారం ఆ మహానటికి నివాళి అర్పిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తీకరిస్తున్నారు. కానీ.. ఏ మాత్రం పట్టింపు లేని టాలీవుడ్ పెద్దలు.. ఈ దిశగా అడుగు కూడా ముందుకు వేయడం లేదు. శ్రీదేవి మరణంపై కనీసం అధికారిక ప్రకటన కూడా మా సంఘం నుంచి రాలేదు.
గతంలో కూడా టాలీవుడ్ పై ఇలాంటి విమర్శలే ఉన్నాయి. కీలక సమయాల్లో సరిగా స్పందించలేదని.. కనీస సంస్కారాన్ని కూడా చూపించుకునేలా ప్రవర్తించలేదని కామెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి శ్రీదేవి విషయంలో కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. దీనిపై టాలీవుడ్ పెద్దలు ఏమంటారో.. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో.. చూడాల్సిందే.