ప్రేక్షక లోకాన్ని విషాదంలో నీ నటి శ్రీదేవి దుర్మరణం భారతీయ ప్రేక్షకలోకాన్ని విషాదంలో నింపింది. ఆమె మరణ వార్త ప్రత్యేకించి దక్షిణాది వారిని దిగ్బ్రాంతికి గురి చేసింది. కేవలం 54 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణం చెందడాన్ని ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు శ్రీదేవి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయారు.. ఇప్పుడీ ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కేవలం 54 ఏళ్లకే ఆమె గుండెపోటుకు గురికావడం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందులోనూ ఆమె దేశం కాని దేశంలో కన్నుమూయడం కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ శ్రీదేవి ఎన్నడూ తీవ్ర అనారోగ్యానికి గురైన దాఖలాలు లేవు. ఆమె ఐదుపదుల వయస్సులోనూ ఆమె ఫిట్ నెస్ బాగా మెయింటైన్ చేశారు. సినీరంగంలో రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంకా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీదేవి మరణవార్త అందర్నీ కలచివేసింది.