అయ్యప్ప దర్శనానికి 550మంది మహిళలు

Update: 2018-11-10 03:52 GMT

25 రోజుల విరామం అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం పునఃప్రారంభం అవుతుంది. దాంతో అయ్యప్పను దర్శించుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ఇప్పటికే శబరిమల యాత్రకు ఆన్‌లైన్‌లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌ తెలిపింది. అంతేగాక శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్‌ చేసుకున్నట్లు తెలిపింది.ఇదిలావుంటే మహిళలందరూ కూడా అయ్యప్పను దర్చించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో  గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకుంటున్నారు. ఈనెల 16వ తేదీన మండలపూజల కోసం అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. 

Similar News