No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ అంటే వడ్డీ ఉండదా.. నిబంధనలు తెలుసుకోండి..!
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ అంటే వడ్డీ ఉండదా.. నిబంధనలు తెలుసుకోండి..!
No Cost EMI: ఈ మధ్య చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌లలో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులని కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయో తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువుని కొనుగోలు చేసేముందు దానిగురించి పూర్తిగా తెలుసుకోవాలని గుర్తుంచుకోండి. లేదంటే చాలా సమస్యలు ఎదురవుతాయి.
ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులను షాపింగ్ చేసేటప్పుడు చాలా మంది నో-కాస్ట్ EMI ఎంపికను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకేసారి పూర్తి ధర చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తాన్ని వాయిదాలుగా విభజించి EMIగా తిరిగి చెల్లించడం సులభమని అందరు నమ్ముతారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారా ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లిస్తే తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేసినప్పుడు నో-కాస్ట్ EMI ద్వారా చాలా లాభాలుంటాయి. అయితే ఈ పద్దతిలో వస్తువులని కొనుగోలు చేసిన తర్వాత వాయిదాను సకాలంలో చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. అందుకే EMI పద్దతిని ఎంచుకునే ముందు వాయిదాలను సులభంగా తిరిగి చెల్లించగలరా లేదా అని చెక్ చేసుకోవడం ముఖ్యం.
నో-కాస్ట్ EMI పద్దతిలో వడ్డీని కస్టమర్‌ల నుంచి నేరుగా వసూలు చేయకపోవచ్చు. కానీ ఏదో ఒక పద్దతిలో వారి నుంచి అధిక సొమ్ముని వసూలు చేస్తారు. వస్తువుల ధర, ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా డిస్కౌంట్లను సర్దుబాటు చేస్తు అదనంగా వసూలు చేస్తారు. కానీ ఇది కస్టమర్లు గమనించకుండా జాగ్రత్తపడుతారు.సాధారణ EMIలో వస్తువును కొనుగోలు చేస్తే వడ్డీ వివరాలు విడిగా తెలియజేస్తారు. కానీ ఈఎంఐలో వడ్డీ వివరాలు చెప్పరు.
నో-కాస్ట్ EMI స్కీమ్‌ని ఎంచుకునే సమయంలో అదనపు ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. వీటిలో ప్రీ-పేమెంట్ పెనాల్టీతో సహా అన్ని అదనపు ఛార్జీలు ఉంటాయి. అనగా మొదటి చెల్లింపు నుంచి ఆలస్య చెల్లింపు ఛార్జీల వరకు వసూలు చేస్తారు. క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీ నో-కాస్ట్ EMI ద్వారా కొనుగోళ్లపై అదనపు తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్‌ను అందజేస్తుంటే దీనిని ఎంచుకోవాలి. ఇది ఉత్తమమైనదని చెప్పవచ్చు.