Twenty Rupees: 20 రూపాయలతో రూ. 2 లక్షలు.. వెంటనే త్వరపడండి..!
PMSBY: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ముఖ్యమనే అభిప్రాయపడుతున్నారు.
PMSBY: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ముఖ్యమనే అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థలు కూడా రకరకాల పొదుపు పథకాలను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బీమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి పథకాలను అమలు చేస్తోంది.
ఇలాంటి ఓ బెస్ట్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న బెస్ట్ స్కీమ్స్‌లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఈ పథకంలో చేరడం ద్వారా రూ. 2 లక్షల ప్రమాద బీమాను పొందొచ్చు. ఇందుకోసం ఏడాదికి చెల్లించాల్సింది కేవలం రూ. 20 మాత్రమే. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది.
ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వారు చేరొచ్చు. పథకంలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే, బాధితుడి కుటుంబానికి రూ. 2 లక్షలు అందిస్తారు. ఒకవేళ పాక్షికంగా వైకల్యానికి గురైతే.. బీమా చేసిన వ్యక్తికి రూ. 1 లక్ష అందిస్తారు. మీకు సమీపంలో ఉన్న ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు.
ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆటో డెబిట్ మోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతో ప్రతీ ఏటా మీ అకౌంట్‌ను డబ్బు ఆటోమెటక్‌గా కట్ అవుతాయి. ప్రతీ సంవత్సరం ఈ బీమా అనేది రెన్యూవల్ అవుతూ ఉంటుంది. తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రీమియం లభించే బెస్ట్ ఇన్సూరెన్స్ పథకాల్లో ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.