Washing Machine: ఇక బట్టలు ఉతకడంలో చింత వద్దు.. చౌకైన వాషింగ్ మెషీన్ వచ్చేసింది..!
Washing Machine: చాలామంది ఇళ్లలో మహిళలు చేతులతో బట్టలు ఉతకలేక ఇబ్బంది పడుతుంటారు.
Washing Machine: చాలామంది ఇళ్లలో మహిళలు చేతులతో బట్టలు ఉతకలేక ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం వాషింగ్ మెషీన్ ధరలు అధికంగా ఉండటమే. దీనిని కొనే సామర్థ్యం లేకపోవడంతో రోజుల తరబడి ఇబ్బందిపడుతూ బట్టలు ఉతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ చింతవద్దు.. ఎందుకంటే వైట్ వెస్టింగ్‌హౌస్ చౌకైన వాషింగ్ మెషీన్‌ని ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 9,499. మాత్రమే. కంపెనీ 5 సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను పరిచయం చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వైట్ వెస్టింగ్‌హౌస్ కంపెనీ 9.5 KG, 10 KG, 11 KG, 11 KG (గ్లాస్ లిడ్ మోడల్),12 KG మోడల్స్‌ని ప్రవేశపెట్టింది. ఇవన్ని జూన్ 19, 2023 నుంచి అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ వాషింగ్ మెషీన్లు హామర్ వాష్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇవి త్వరగా బట్టలని శుభ్రం చేస్తాయి. వైట్-వెస్టింగ్‌హౌస్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
వైట్-వెస్టింగ్‌హౌస్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ డబుల్ వాటర్‌ఫాల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది త్వరగా బట్టలు ఉతుకుతుంది. శక్తివంతమైన డ్రైయర్‌ని కలిగి ఉంటుంది. సంప్రదాయ డ్రైయర్‌ల కంటే 10 రెట్లు వేగంగా దుస్తులను ఆరబెడుతుంది. వాషింగ్ అవసరాలన్నింటికీ ఒకే-స్టాప్ సొల్యూషన్‌ని లక్ష్యంగా చేసుకునే వినియోగదారుల కోసం పూర్తి ప్యాకేజీగా వస్తుంది.
వైట్-వెస్టింగ్‌హౌస్ ఇతర మోడళ్ల ధరల గురించి మాట్లాడితే 10 కిలోల సామర్థ్యం గల మెషిన్ ధర రూ.10,499. 11 కేజీల సామర్థ్యం గల యంత్రం రూ.11,499కి లభిస్తుండగా 12 కేజీల సామర్థ్యం గల యంత్రం రూ.12,499కి లభిస్తుంది. అమెజాన్ ఇండియా మంచి ఆఫర్లని కూడా అందిస్తుంది. వినియోగదారులు త్వరగా కొనుగోలు చేస్తే మంచి బహుమతులని కూడా ఆఫర్ చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం రివ్యూలు చదివి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే సరైన నిర్ణయం తీసుకోవాలి.