వివో కొత్త స్మార్ట్ ఫోన్!
వివో వై50 పేరుతో వివో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది.
వివో వై50 పేరుతో వివో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఈ నెల ప్రారంభంలో ఇదే పేరుతో కాంబోడియాలో కూడా వివో లాంచ్ చేసింది. లాక్ డౌన్ తరువాత మనదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి భారతదేశంలో వివో వై50 పేరుతో వస్తుందో.. పేరు మారుస్తారో వేచి చూడాల్సిందే.
చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ధరను 1,698 యువాన్లుగా(సుమారు రూ.18,310) నిర్ణయించారు. వివో అధికారిక వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫాంల్లో ఈ ఫోన్ ను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. గ్లేసియర్ బ్లూ, సిల్వర్, ఆబ్సీడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
ప్రత్యేకతలు ఇవే!
♦ వివో వై50 స్మార్ట్ ఫోన్ లో
♦ 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
♦ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
♦ పంచ్ హోల్ డిజైన్
♦ 90.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో
♦ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో
♦ వెనకభాగంలో నాలుగు కెమెరాల సెటప్
♦ ఫింగర్ ప్రింట్ సెన్సార్
♦ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
♦ 18W ఫాస్ట్ చార్జింగ్
♦ వైఫై 802.11ac టెక్నాలజీ
♦ కెమేరాలిలా..
ఈఫోనులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు హోల్ పంచ్ లో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.