Gold Rate: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

Gold Rate: స్వల్పంగా బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Update: 2021-04-16 01:08 GMT
Today Gold Rate, Silver Price 16th-April-2021

Gold Rate:(File Image)

  • whatsapp icon

Gold Rate: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దాదాపు ఈ నెలలో 14 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2,330 వరకు పెరిగింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,540 వరకు పెరిగింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ వస్తే… బంగారం ధరలు మరింత పడిపోతాయేమో అనే భయాలతో కొంత మంది ఇన్వెస్టర్లు… పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో నిన్నటి బంగారం ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. అయితే దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు కరోనా ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,030 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,630 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 వద్ద కొనసాగుతోంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 ఉంది. ఏపిలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,670 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.43,700 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,670 ఉంది.

వెండి ధరలు..

ఒక రోజు వెండి ధరలు తగ్గుతుంటే..మరో రోజు దూసుకుపోతోంది. గురువారం మాత్రం కిలో వెండి ధరపై 1300 వరకు పెరుగగా, తాజాగా శుక్రవారం రూ.200 పెరిగింది. అయితే ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు వెండి ధరలు పరిశీలిస్తే పెరుగుదలనే కనిపిస్తోంది. గత 15 రోజుల్లో వెండి ధర కిలోకు రూ.5,900 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,800 ఉండగా, ముంబైలో రూ. 67,800 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా,. కోల్‌కతాలో రూ.67,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కేరళలో రూ.67,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విజయవాడలో రూ.71,900 ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 16-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Tags:    

Similar News