Today Gold Rate: పండగపూట పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

Today Gold Rate: బంగారం ధర భారీగా పడిపోయింది అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం పసిడి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 300 రూపాయలు తగ్గింది. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..రూ.76,630 పలుకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240 వద్ద పలుకుతోంది.

Update: 2024-10-11 01:19 GMT

నిజానికి బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరిగాయి ఏకంగా ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి పోల్చినట్లయితే బంగారం ధర ప్రస్తుతం దాదాపు 800 రూపాయలు తగ్గింది. అయితే బంగారం ధరలు స్వల్ప రిలీఫ్ ఇవ్వడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ రిలీఫ్ తాత్కాలికమా లేక భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా అనేది అంచనా వేయాల్సి ఉంది.

మరోవైపు అంతర్జాతీయంగా పరిస్థితులు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం అనేది ఇంకా సమసిపోలేదు. మరోవైపు మన దేశంలో కూడా బంగారం ఆభరణాల కొనుగోలు డిమాండ్ ఈ నెలలో భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ధన త్రయోదశి ఉంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

వీటన్నిటిని బేరీజు వేసుకొని చూస్తున్నట్లయితే బంగారం ధర భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నిపుణులు మాత్రం బంగారం ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయమని సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాల కొనుగోలు విషయంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఒక గ్రాము తేడా వచ్చినా కూడా మీరు వేలల్లో డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని మీరు షాపింగ్ చేయాలి. ముఖ్యంగా తూకం విషయంలోనూ, నాణ్యత విషయంలోనూ, హాల్ మార్క్ విషయంలోను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News