ఐటీ చరిత్రలో సంచలనం.. కలిసిపోయిన దిగ్గజ కంపెనీలు

ఐటీ చరిత్రలో సంచలన కలయిక చోటుచేసుకుంది. తొలిసారిగా దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్‌, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి.

Update: 2020-06-19 16:16 GMT

ఐటీ చరిత్రలో సంచలన కలయిక చోటుచేసుకుంది. తొలిసారిగా దిగ్గజ ఐటీ కంపెనీ లైన టీసీఎస్‌, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా, టిసిఎస్ ఒక ఐబిఎం ఎంటర్ప్రైజ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది, ఇందులో రెండు సంస్థల నుండి సాంకేతిక నిపుణులు ఉంటారు.

వారు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. అయితే డేటా ఎస్టేట్‌ , వివిధ రకాల అప్లికేషన్స్‌ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. కాగా గతంలో డిజిటల్‌ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచేందుకు గాను ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత టీసీఎస్‌, ఐబీఎం లాంటి ఐటి సంస్థలు పార్ట్నర్ లు కావడం విశేషం. 


Tags:    

Similar News