Solar Cooking Stove: గ్యాస్, పవర్ అవసరమే లేదు.. ఒక్కసారి ఖర్చు చేస్తే.. జీవితాంతం ఫ్రీగా వంట చేసుకోవచ్చు..!

Solar Cooking Stove: కొత్త స్టవ్ మార్కెట్లోకి వస్తోంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు గ్యాస్ లేదా కరెంట్ అవసరం ఉండదు. ఇది చాలా చౌకగా ఉంటుంది.

Update: 2023-04-17 15:30 GMT

Solar Cooking Stove: గ్యాస్, పవర్ అవసరమే లేదు.. ఒక్కసారి ఖర్చు చేస్తే.. జీవితాంతం ఫ్రీగా వంట చేసుకోవచ్చు..!

Solar Cooking Stove: వంటగ్యాస్ ధరల్లో నిత్యం పెరుగుదల కనిపిస్తూనే ఉంది. దీంతో వినియోగదారుల్లో రోజు రోజుకు ఆందోళన పెరుగుతూనే ఉంటుంది. ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇతర పద్ధతుల వైపు మరలుతున్నారు. ఈ క్రమంలోనే ఇండక్షన్ స్టవ్‌లు వచ్చాయి. అయితే, దీనికి ఎక్కువ ఖర్చవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొత్త స్టవ్ మార్కెట్లోకి వస్తోంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు గ్యాస్ లేదా కరెంట్ అవసరం ఉండదు. ఇది చాలా చౌకగా ఉంటుంది. కేవలం రూ. 12,000 ఖర్చు చేయడం ద్వారా మీరు మీ జీవితాంతం ఉచితంగా ఆహారాన్ని వండుకోవచ్చు. గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయనే బాధ కూడా ఉండదు. ఈ సాంకేతికత నిజంగా అద్భుతమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ స్టవ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం..

సూర్య నూతన్ సోలార్ స్టవ్..

ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాంకేతికతను ప్రారంభించింది. ఈ కొత్త సాంకేతికతతో తయారైందే సూర్య నూతన్ సోలార్ స్టవ్. దీనితో మీరు గ్యాస్ లేదా విద్యుత్ ఖర్చు లేకుండా జీవితకాలం వంట చేయవచ్చు. ఈ స్టవ్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తయారు చేసింది. పాత సోలార్ స్టవ్ ఎండలో ఉంచాలి. కానీ, సూర్య నూతన్ స్టవ్ వంటగదిలో అమర్చడం ద్వారా ఉపయోగించవచ్చు.

పాత సోలార్ స్టవ్‌లకు పూర్తి భిన్నంగా దీన్ని 24 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఈ స్టవ్‌ని ఉపయోగించడం వల్ల గ్యాస్, కరెంటుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి జీవితాంతం ఉచితంగా ఆహారాన్ని వండుకోవచ్చు. ఈ సోలార్ స్టవ్ రెండు యూనిట్లతో తయారు చేశారు. ఒక యూనిట్ వంటగదిలో ఉంచుతారు. మరొక యూనిట్ ఎండలో ఉంచుతారు. ఇది పగలు, రాత్రి ఉపయోగించవచ్చు. పగటిపూట శక్తిని నిల్వ చేయడం ద్వారా రాత్రిపూట వంట చేసుకోవచ్చు.

Link: https://iocl.com/pages/SuryaNutan

Tags:    

Similar News