Business Plan: సూపర్ హిట్ బిజినెస్ ప్లాన్.. లక్ష పెట్టుబడి పెడితే నెలకి 10 లక్షలు..!
Business Plan: మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటే ఈ వార్త మీ కోసమే.
Business Plan: మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. ఈ వ్యాపారంతో మీరు ప్రతి నెలా 10 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారం అయినప్పటికీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాపారం వ్యవసాయానికి సంబంధించినది. పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైన వ్యాపారం. ఖర్చు కంటే 10 రెట్లు లాభం ఉంటుంది. అంటే రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. గత కొన్నేళ్లుగా పుట్టగొడుగులకు డిమాండ్ కూడా పెరిగింది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం బటన్ మష్రూమ్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని తయారు చేసేందుకు గోధుమలు లేదా వరిగడ్డిని కొన్ని రసాయనాలతో కలిపి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు. దీనిని సిద్ధం చేయడానికి ఒక నెల పడుతుంది. తరువాత ఉపరితలంపై 6-8 అంగుళాల మందపాటి పొరను విస్తరించడం ద్వారా పుట్టగొడుగు విత్తనాలను నాటుతారు. వీటిని కంపోస్ట్‌తో కప్పి ఉంచుతారు. 40-50 రోజుల్లో పంట సిద్దంగా ఉంటుంది. పుట్టగొడుగులను కట్ చేసి అమ్ముకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకం కోసం మీకు ఓషెడ్ అవసరముంటుంది.
రూ.లక్ష నుంచి పుట్టగొడుగుల పెంపకం ప్రారంభిస్తే మంచి లాభం పొందవచ్చు. ఒక కిలో పుట్టగొడుగుల ఉత్పత్తికి 25-30 రూపాయలు ఖర్చు చేస్తారు. మార్కెట్‌లో కిలో రూ.250 నుంచి 300 వరకు విక్రయిస్తారు. పెద్ద పెద్ద హోటళ్లు లేదా రెస్టారెంట్లకు నాణ్యమైన పుట్టగొడుగులను సరఫరా చేస్తే కిలోకు రూ.500 వరకు ధర పలుకుతుంది.