Sugar Price Hike: దేశ ప్రజలకు పిడుగులాంటి వార్త..పెరగనున్న బెల్లం, పంచదార ధరలు
Sugar Price Hike: నిత్యవసరాలు సామాన్యులకు షాకిస్తూనే ఉన్నాయి. వచ్చే అరకొర ఆదాయానికి తోడు నిత్యవసరాల ధరలు భారీగా పెరగడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సామాన్యులపై మరో పిడుగు పడేందుకు సిద్ధంగా ఉంది. బెల్లం, పంచాదార ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతినెలా ఇంటిబడ్జెట్ పెరుగుతూనే ఉంది. ధర పెరుగుదల కారణంగా బడ్జెట్ కూడా పెరుగుతుంది. దీన్నే ద్రవ్యోల్బణం అంటాం. అయితే ధర పెరుగుదలకు దేశీయంగానే కాదు..అంతర్జాతీయ పరిణమాలు కూడా కారణం అవుతుంటాయి. ధరల పెరుగుదల ఒక సైకిల్ చక్రం వలే అనేక అంశాలతో లింక్ అయి ఉంటాయి.
కేంద్రంలోని మోదీ సర్కార్ ఒక మంచి ఉద్దేశ్యంతో చెరుకు రైతులకు మేలు జరిగే విధంగా టన్నుకు రూ. 250 వరకు పెంచింది. ఇప్పుడు టన్ను చెరుకు రూ. 3,400 పొందుతున్నారు రైతులు. ఒకరకంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ చెరుకు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధర రూ. 3,150 ఉండేది. ఇది గిట్టుబాటు కావడం లేదని రైతులు పదే పదే చెబుతున్నారు. దీంతో రూ. 250 పెంచింది. ఇప్పుడు రైతులకు రూ. 3,400 వరకు మద్దతు ధర ఉంది. తద్వారా రైతులు కనీసం నష్టాల బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంది.
రైతుల నుంచి టన్ను రూ. 3,400 కొనుగోలు చేసే కర్మాగారాలు..ఆ భారాన్ని తమ నెత్తిమీద వేసుకోవు. చక్కెర, బెల్లం ఉత్పత్తి వ్యయం పెరిగిందని చెబుతూ ధరలను పెంచేస్తుంటాయి. హోల్ సేల్ వ్యాపారులు కూడా భారీగా పెంచుతారు. ఆ తర్వాత రిటైల్ వ్యాపారులు కూడా పెంచుతారు. ఇలా మూడు రకాల పెంపులతో పంచదార, బెల్లం, సామాన్యుల చేతికి వచ్చేసరికి భారీగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం చక్కెర కిలో ధర రూ. 40 నుంచి 75 వరకు ఉంది. బెల్లం కూడా కిలో రూ. 40 నుంచి రూ. 100 వరకు ఉంది. పంచదారను రోజూ వాడుతుంటాం. ఇప్పటికే ఉల్లిపాయలు, కూరగాయలు, పప్పుల ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలో చక్కెర ధర పెరగడం మరింత భారంగా మారుతుంది.