Stock Market: దీపావళి రోజున నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: దీపావళి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.
Stock Market: దీపావళి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ విశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో చివరకు సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 వేల 44 పాయింట్ల వద్ద ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79 వేల 287 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి.. చివరికి 553 పాయింట్లు నష్టపోయి 79 వేల 389 వద్ద ముగిసింది.
నిఫ్టీ 135 పాయింట్లు క్షీణించి 24 వేల 205 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24 వేల 172 నుంచి 24 వేల 372 మధ్య ఊగిసలాడింది. సెన్సెక్స్ సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. దీపావళి సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి ముహురత్ ట్రేడింగ్ ప్రారంభం కానుంది.