Business Idea: లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టండి.. పెళ్లిళ్ల సీజన్‌లో బంపర్‌ ఆదాయం..!

Business Idea: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో దీనిని సద్వినియోగం చేసుకోవడం వల్ల బాగా సంపాదించే అవకాశం ఉంది.

Update: 2023-03-04 08:00 GMT

Business Idea: లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టండి.. పెళ్లిళ్ల సీజన్‌లో బంపర్‌ ఆదాయం..!

Business Idea: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో దీనిని సద్వినియోగం చేసుకోవడం వల్ల బాగా సంపాదించే అవకాశం ఉంది. కేవలం లక్ష రూపాయలతో టెంట్‌హౌజ్‌ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వివాహాల సీజన్‌లో బంపర్ ఆదాయం సంపాదించవచ్చు. నగరం, పట్టణం, మెట్రో సిటీలో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. విశేషం ఏంటంటే ఈ వ్యాపారంలో ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. నేటి కాలంలో చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద కార్యక్రమాల వరకు మనిషికి టెంట్ హౌస్ అవసరం. అందుకే ఈ వ్యాపారం సహాయంతో ఒక వ్యక్తి మంచి లాభం పొందవచ్చు.

ఏ వస్తువులు అవసరమవుతాయి?

మీరు టెంట్ హౌస్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందుగా టెంట్‌కు సంబంధించిన కొన్ని వస్తువులు అవసరమవుతాయి. వీటిలో చెక్క లేదా వెదురు స్తంభాలు, ఇనుప పైపులు, అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, కార్పెట్, లైట్లు, ఫ్యాన్లు, పరుపులు, హెడ్‌బోర్డ్‌లు, బెడ్ షీట్‌లు మొదలైనవి అవసరమవుతాయి. అలాగే అతిథుల ఆహారం, పానీయాల కోసం పాత్రలు, వంట కోసం గ్యాస్, స్టవ్, నీటిని ఉంచడానికి పెద్ద పెద్ద డ్రమ్‌లు, ఇంకా కొన్ని చిన్న వస్తువులు అవసరం అవుతాయి.

ఎంత డబ్బు అవసరం?

మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఏ స్థాయిలో ప్రారంభించాలో మీరే నిర్ణయించుకోండి. మీ వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఒక వ్యక్తి 1 లక్ష నుంచి 1.5 లక్షల ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు మీకు ఎలాంటి కొరత లేదా డబ్బు కొరత లేకపోతే మీరు ఐదు లక్షల రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు.

లాభం ఎంత ఉంటుంది?

మీరు ఈ వ్యాపారం చేస్తే ప్రారంభంలో ప్రతి నెలా 25,000 నుంచి 30,000 రూపాయల వరకు సంపాదిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్ అయితే నెల రోజుల్లోనే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇందులో నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News