SBI: వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..?

SBI Interest Rates: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.

Update: 2021-12-17 15:15 GMT

SBI: వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..?

SBI Interest Rates: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ విషయం ఎస్బీఐ ఖాతాదారులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 0.10 శాతం వడ్డీ రేటు పెంచినట్టు ఎస్బీఐ పేర్కొంది. కొత్తగా పెంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

SBI 7-45 రోజుల FDలపై వడ్డీ రేట్లను 2.90 శాతం నుంచి 3 శాతానికి పెంచింది. అదే సమయంలో సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను 3.40 శాతం నుంచి 3.50 శాతానికి పెంచారు. SBI 180-210 రోజుల FDలపై వడ్డీ రేట్లను 3 శాతం నుంచి 3.10 శాతానికి పెంచింది. అదే సమయంలో సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను 3.50 శాతం నుంచి 3.60 శాతానికి పెంచారు.SBI 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల FDలపై వడ్డీ రేట్లను 4.90 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. అదే సమయంలో సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను 5.40 శాతం నుంచి 5.50 శాతానికి పెంచారు.

SBI FDలపై వడ్డీ రేట్లను 2 నుంచి 3 సంవత్సరాల వరకు 5.10 వద్ద ఉంచింది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 5.60 శాతంగా ఉన్నాయి. ఇతర వడ్డీ రేట్లను కూడా బ్యాంక్ స్థిరంగా ఉంచింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్‌ వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లను పెంచుతూ ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. పెంపుతర్వాత బేస్‌ రేట్‌ 7.55 శాతానికి చేరింది. దీంతో గృహ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలన్నీ కాస్త భారమవుతాయి.

Tags:    

Similar News