పీఎం కిసాన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారా.. అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 14 కోట్ల మందికి ప్రయోజనం..!

SATHI App and Portal: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.

Update: 2023-04-20 07:32 GMT

పీఎం కిసాన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారా.. అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 14 కోట్ల మందికి ప్రయోజనం..!

SATHI App and Portal: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. 14 వ విడత సాయాన్ని మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేయవచ్చు. అయితే దీనికి ముందు, దేశంలోని రైతులను ఆదుకోవడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొత్త అడుగు వేశారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను విడుదల చేసింది. దేశంలోని 14 కోట్ల మంది రైతులు ఈ యాప్‌ వల్ల ప్రయోజనం పొందనున్నారు.

పోర్టల్, మొబైల్ యాప్ విడుదలైంది..

నకిలీ విత్తనాలను గుర్తించడం, ప్రామాణీకరించడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రి పోర్టల్, మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. తోమర్ 'సాథి' (SATHI యాప్) (సీడ్ ట్రేసిబిలిటీ, అథెంటికేషన్, హోలిస్టిక్ ఇన్వెంటరీ) పేరుతో పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది విత్తన నాణ్యత ట్రాకింగ్, ధృవీకరణ, నిల్వ కోసం కేంద్రీకృత ఆన్‌లైన్ సిస్టమ్ అన్నమాట.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో NIC రూపొందించిన ఈ యాప్..

విత్తనోత్పత్తి, నాణ్యమైన విత్తన గుర్తింపు, విత్తన ధృవీకరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించారు. దీనిని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో 'ఉత్తమ విత్తనం-సమృద్ధి చేసిన రైతు' అనే అంశంపై NIC అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులను అధిగమించేందుకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కృషి చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News