PAN 2.O Free Apply: పాన్ 2.0కు కావాల్సిన డాక్యూమెంట్స్ ఏంటి.. ఉచితంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?

PAN 2.O Free Apply: పాన్ 2.O ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు పాన్‌ కోసం దరఖాస్తు, వివరాల్లో మార్పులు, తప్పుల సవరణ, ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేసుకోవచ్చు.

Update: 2024-12-04 02:30 GMT

PAN 2.O Free Apply: పాన్ 2.0కు కావాల్సిన డాక్యూమెంట్స్ ఏంటి.. ఉచితంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?

PAN 2.O Free Apply: ఇటీవల భారత ప్రభుత్వం పాన్ 2.O ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. పన్ను చెల్లింపుదార్లకు మెరుగైన సేవలు, నూతన సాంకేతికతలను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సులువుగా, వేగంగా, నాణ్యమైన సేవలను పన్ను చెల్లింపుదార్లకు అందించడం కోసం కొత్త పాన్‌ కార్డులను క్యూఆర్‌ కోడ్‌తో తీసుకొస్తోంది కేంద్రం.

పాన్ 2.O ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు పాన్‌ కోసం దరఖాస్తు, వివరాల్లో మార్పులు, తప్పుల సవరణ, ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేసుకోవచ్చు. అలానే కార్డు పోగొట్టుకున్నా లేదా కాలం చెల్లిన పాన్ కార్డు స్థానంలో కొత్తవి జారీ అవుతాయి. క్యూఆర్‌ కోడ్‌ విధానం 2017-18 నుంచే అమల్లో ఉంది. అప్పటి నుంచి జారీ అయిన కార్డులకు క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. 2.0లోనూ ఇదే విధంగా కార్డులు వస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే.. పాన్‌ డేటా బేస్‌లో ఉన్న డీటెయిల్స్ కనిపిస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ లేని పాన్‌ కార్డు దారులు క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మాత్రం తప్పనిసరి కాదు.

ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్ దారులు పాన్ 2.0 కోసం ఆటోమేటిక్‌గా అర్హులు. ఇప్పటికే పాన్ ఉంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్ కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ప్రస్తుత పాన్‌ కార్డులను పాన్‌ 2.0లో అప్‌డేట్‌ చేశాక.. ప్రతి పాన్‌ కార్డు దారుకు ఇ-పాన్‌ను మెయిల్‌కు పంపుతారు. ఇందుకోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొత్త కార్డు భౌతికంగా కావాలంటే మాత్రం డెలివరీ కోసం రూ.50 చెల్లించాలి. పాన్ 2.0 కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తింపు కార్డు అవసరం. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. ఏదైనా ఒకటి తప్పనిసరి. అలానే అడ్రెస్ ప్రూఫ్ (యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు), డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ కూడా అవసరం.

ఆన్‌లైన్‌లో పాన్ 2.0 దరఖాస్తు ప్రక్రియ:

1. ముందుగా యూనిఫైడ్ పోర్టల్‌కి వెళ్లాలి

2. మీ వ్యక్తిగత వివరాలను ఫిల్ చేయాలి

3. అవసరమైన డాకుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి

4. వివరాలను సమీక్షించి అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి

https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html

https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange

Tags:    

Similar News