Gold Rate Today: రూ. 6వేలు తక్కువకే లభిస్తున్న బంగారం.. నేడు స్వల్పంగా పెరిగిన పసిడి ధర
Gold Rate Today: నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోల్చితే కేవలం రూ. 100 పెరిగింది. బంగారం ధరలు డిసెంబర్ 4వ తేదీ బుధవారం ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78830 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72100 రూపాయాలు ఉంది.
బంగారం ధరలు మంగళవారంతో పోల్చితే బుధవారం స్వల్పంగా పెరిగాయి. అయినా కూడా బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి 84వేలను దాటలేకపోతున్నాయి. 84వేల రూపాయల నుంచి తగ్గుముఖం పడుతూనే వస్తుంది. ప్రస్తుతంగా ఇంకా 6000వేల రూపాయలు తక్కువగానే ట్రేడ్ అవుతోంది. దీంతో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గుతాయని ఆశాభావంతో బంగారం ప్రియులు ఉన్నారు.
బంగారం ధరలు అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా డాలర్ ధర బంగారం ధరను నిర్ణయిస్తుంది. డాలర్ ధర ప్రస్తుతం బలంగా ఉంది. దీంతో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను అమెరికాలోని బాండ్ మార్కెట్ పై పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.
అంతకుముందు పెట్టుబడి దారులు సురక్షితమైన బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు. ఆ తర్వాత పెట్టుబడులను ఉపసంహరించి ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు అదే విధంగా అమెరికా బాండ్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ట్రంప్ అమెరికా ఆర్థిక విధానం ప్రొటక్షనిజం వైపుగా ఉంటుందని తెలిపారు. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్లు మరింత బలపడే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బంగారంపై పెట్టుబడి పెట్టినవారు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వైపు తరలించే ఛాన్స్ ఉంటుంది.