రైతులకి బంపర్ ఆఫర్.. ఈ స్కీం కింద సులువుగా రూ.50,000..!

PNB Kisan Tatkal Loan: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం ప్రత్యేక స్కీంతో ముందుకు వచ్చింది.

Update: 2022-09-20 14:39 GMT

రైతులకి బంపర్ ఆఫర్.. ఈ స్కీం కింద సులువుగా రూ.50,000..!

PNB Kisan Tatkal Loan: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం ప్రత్యేక స్కీంతో ముందుకు వచ్చింది. ఇందులో వారికి 50వేల రూపాయలు అందిస్తోంది. మీరు వ్యవసాయం కాకుండా వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఈ స్కీం ఏంటి.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్‌ని ప్రారంభించింది. దీని కింద డబ్బు రైతుల ఖాతాలో జమ అవుతుంది. ప్రతి రైతు అవసరాలను తీర్చేందుకు PNB కిసాన్ తత్కాల్ లోన్ పథకాన్ని తీసుకొచ్చినట్లు బ్యాంకు తన అధికారిక ట్వీట్టర్‌ ద్వారా తెలిపింది. ఎటువంటి హామి లేకుండా, కనీస పత్రాలు లేకుండా ఈ లోన్‌ మంజూరు చేస్తుంది.

ఈ పథకం కింద వ్యవసాయం లేదా గృహావసరాల కోసం లోన్‌ తీసుకోవచ్చు. ఎలాంటి అవసరాలను తీర్చుకోవడానికైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. PNB తత్కాల్ లోన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు వ్యవసాయం చేస్తున్న రైతు అయి ఉండాలి లేదా వ్యవసాయ భూమి కౌలుదారు అయి ఉండాలి. రుణగ్రహీత తప్పనిసరిగా వ్యవసాయదారుడై ఉండాలి. బ్యాంకు ప్రకారం ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కలిగి ఉన్న రైతులు లేదా రైతు సమూహాలకు మాత్రమే ఈ లోన్‌ మంజూరుచేస్తారు. అంతేకాదు గత రెండేళ్ల బ్యాంకు రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలి.

కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ కింద వారి ప్రస్తుత రుణ పరిమితిలో 25 శాతం వరకు రుణాలు ఇస్తారు. గరిష్ట పరిమితి రూ.50,000. ఈ రుణం తీసుకోవడానికి రైతులు ఏమీ తాకట్టు పెట్టనవసరం లేదు. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద పొందిన రుణ మొత్తాన్ని చెల్లించడానికి 5 సంవత్సరాల సమయం ఇస్తారు. రుణ వాయిదాలు కూడా సులువుగా ఉండటం వల్ల తిరిగి చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు. రైతులు ఈ రుణం తీసుకోవడానికి PNB శాఖను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News