రైతుల ప్రయోజనం కోసమే ఈ పథకం.. నష్టం జరిగితే ఆర్థిక సాయం..!

PMFBY: ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలని ప్రవేశపెట్టింది.

Update: 2023-01-19 15:00 GMT

రైతుల ప్రయోజనం కోసమే ఈ పథకం.. నష్టం జరిగితే ఆర్థిక సాయం..!

PMFBY: ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలని ప్రవేశపెట్టింది. వీటిలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (RWBCIS) ఉన్నాయి. ఈ రెండు పథకాలని 2016లో ప్రారంభించారు. సహజ నష్టాలకు వ్యతిరేకంగా సమగ్ర పంట బీమా కవరేజీని అందించడం ఈ పథకాల ఉద్దేశ్యం. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకాల లక్ష్యం వ్యవసాయ రంగంలో స్థిరమైన ఉత్పత్తికి తోడ్పాటు అందించడం, ఊహించని సంఘటనల వల్ల జరిగని పంట నష్టానికి రైతులకు ఆర్థిక సహాయం చేయడం, వ్యవసాయంలో వారి కొనసాగింపును నిర్ధారించడానికి రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడం, వినూత్న, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

ప్రభుత్వం ప్రకారం ఉత్పత్తి ప్రమాదం నుంచి రైతులను రక్షించడమే కాకుండా ఈ పథకాలు ఆహార భద్రత, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగం వృద్ధి, పోటీతత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ పథకాలు ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వార్షిక వాణిజ్య/ఉద్యాన పంటలకు 5 శాతం అతి తక్కువ ప్రీమియంతో పంట నష్టాలని కవర్‌ చేస్తాయి.

50:50 నిష్పత్తి ఆధారంగా ప్రీమియం బ్యాలెన్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షేర్‌ చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నోటిఫై చేసిన ప్రాంతాలు, పంటలకి ఇవి వర్తిస్తాయి. అంతేకాకుండా రుణం పొందిన రైతులకు ఈ పథకాలు తప్పనిసరిగా ఉంటాయి. రుణం పొందని రైతులకు స్వచ్ఛందంగా ఉంటాయి. దీంతో పాటు ప్రధానమంత్రి బీమా యోజన,ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన ఉండనే ఉన్నాయి.

Tags:    

Similar News