Business Idea: సొంతూరిలోనే ఉంటూ లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా

Business Idea: ప్రస్తుతం వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాలనే వారి సంఖ్య తగ్గుతోంది.

Update: 2024-10-20 09:14 GMT

Business Idea

Business Idea: ప్రస్తుతం వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాలనే వారి సంఖ్య తగ్గుతోంది. వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించి మరో నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నారు. అయితే వ్యాపారాల్లో నష్టం వస్తుందన్న భయంతో కొందరూ ఆ దిశగా అడుగులు వేయరు. అయితే మార్కెట్లో అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్లో చిన్నారులకు సంబంధించిన స్నాక్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. పోలో రింగ్స్‌ వంటి స్నాక్స్‌ను తయారు చేసి, సొంత బ్రాండింగ్‌తో విక్రయిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఉన్న ఊరిలోనే ఉంటూ భారీగా ఆదాయం ఆర్జించాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక రేకుల షెడ్‌ లేదా పెద్ద గది అవసరపడుతుంది.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొన్ని రకాల మిషిన్స్‌ అవసరపడుతాయి. అలాగే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ తీసుకోవాలి. పోలో రింగ్స్‌ తయారు చేయడానికి కార్న్‌ పౌడర్‌ కావాల్సి ఉంటుంది. కార్న్‌ను రవ్వలా తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ కార్న్‌ రవ్వ మార్కెట్లో లభిస్తోంది. ఈ రవ్వను మిషన్‌లో వెయ్యాలి. స్నాక్‌ ఆకారం ఎలా ఉండాలన్న దానికి సంబంధించి ప్లేట్స్‌ అందుబాటులో ఉంటాయి.

ఇలా తయారు చేసుకున్న పోలో రింగ్స్‌ను తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్‌ సెట్ చేసుకోవాలి. రింగ్స్‌ రోస్ట్‌ అయిన తర్వాత వాటికి మసాలాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకో మరో మిషన్ ఉంటుంది. మసాలా మిక్సింగ్‌ మిషన్‌లో రింగ్స్‌ను వేసి.. అందులో మసాలాలు వేయాలి. ఈ ప్రాసెస్‌ పూర్తయ్యాక. రింగ్స్‌ను ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి మీ సొంత బ్రాండింగ్‌తో విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని రూ. 10 లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. లాభాల విషయానికొస్తే మీ మార్కెటింగ్‌ ఆధారంగా నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందొచ్చు.

Tags:    

Similar News