గూగుల్‌కు పోటీగా పేటీఎం యాప్ స్టోర్.. ఎటువంటి రుసుము అక్కర్లేదు..
సెర్చ్ దిగ్గజం గూగుల్ ను సవాల్ ను చేసేలా డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ డెవలపర్‌లకు సహాయం చేయడానికి పేటీఎం 'ఆండ్రాయిడ్ మినీ..
సెర్చ్ దిగ్గజం గూగుల్ ను సవాల్ ను చేసేలా డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ డెవలపర్‌లకు సహాయం చేయడానికి పేటీఎం 'ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్'ను ప్రారంభించింది. దీంతో యాప్ స్టోర్ రంగంలో అమెరికన్ కంపెనీలు గూగుల్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్ ఆధిపత్యానికి ప్రత్యక్ష సవాలుగా నిలిచింది. స్పోర్ట్స్ బెట్టింగ్ ఆరోపణలపై గూగుల్ సెప్టెంబర్ 18 న యాప్ స్టోర్ నుండి తొలగించిన తరువాత పేటీఎం ఈ యాప్ ను డెవలప్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ మినీ యాప్ స్టోర్ వినియోగదారులను పెద్ద సంఖ్యలో పెంచుకోవడానికి సహాయపడుతుందని పేటిఎం ఒక ప్రకటన విడుదల చేసింది. పేటీఎం ప్రకారం, ఇప్పటివరకు 300 కి పైగా కంపెనీలు ఈ మినీ యాప్ స్టోర్‌లో చేరాయి. ఇందులో డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్‌మెడ్స్, 1 ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్ మెనూ, నోబ్రోకర్ వంటి సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం మినీ యాప్ స్టోర్‌లో యాప్ ను చేర్చడానికి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు..
కానీ గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ తమ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు పేటీఎం తెలిపింది. ఈ మినీ యాప్ స్టోర్ పేటీఎం యాప్ లో అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ రంగంలో గూగుల్‌ను సవాలు చేయడానికి భారతీయ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు ఇందుకు కలిసి వచ్చారు. 50 మందికి పైగా స్టార్టప్ వ్యవస్థాపకులు గత వారం ఇండియన్ యాప్ స్టోర్ అవకాశాలపై చర్చించారు. వారిలో పేటీఎంకు చెందిన విజయ్ శేఖర్ శర్మ, రోజర్-పేకి చెందిన హర్షిల్ మాథుర్ ఉన్నారు.