Mist Fan: ఈ ఫ్యాన్‌ ఉపయోగిస్తే.. ఏసీ, కూలర్‌ని మర్చిపోతారంతే.. ఇంట్లో మంచు కురిసినట్లే..!

Mini Fan: ప్రస్తుతం భారత్‌లో వేడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ ఇళ్లలో ఏసీ, కూలర్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. AC, కూలర్ వంటి వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్లు కూడా వస్తున్నాయి. ఈ ఫ్యాన్లు ఉష్ణోగ్రతను తగ్గించడానికి గాలి, నీటితో కలిసి పనిచేస్తాయి.

Update: 2023-06-04 08:30 GMT

Mist Fan: ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలామంది కూలర్లు, ఏసీలను వాడుతుంటారు. వీటితో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంటుంది. అయితే, వీటిని ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లాలంటే మాత్రం చాలా కష్టం. అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాన్‌ని చూశారంటే మాత్రం కచ్చితంగా ఫిదా అవుతారు. ఇది మీకు ఇండోర్ లేదా అవుట్‌డోర్ ప్రదేశాలలో చాలా చల్లదనాన్ని ఇస్తుంది.

పెళ్లి వంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఇలాంటి ఫ్యాన్‌లను చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఇంట్లో కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. అలాంటి ఒక మోడల్ గురించి తెలుసుకుందాం.

దీని పేరు ఓరియంట్ ఎలక్ట్రిక్ క్లౌడ్ 3 ఫ్యాన్. దీని ధర రూ. 15,999. ఇది ఇటీవల భారతదేశంలో ప్ఎంట్రీ ఇచ్చింది.

ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు తగ్గించగలదు. క్లౌడ్‌చిల్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఈ సాంకేతికత వలన నీటి కణాలను నానో కణాలుగా మారుస్తుంది. దీని వలన ఫ్యాన్‌‌లో అమర్చిన ఛాసిస్ ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు వస్తుంది.

ఈ ఫ్యాన్‌లో కూడా నీళ్లు పోయాల్సి ఉంటుంది. దీని వాటర్ ట్యాంక్ 4.5 లీటర్ల సామర్థ్యంతో ఉంది. దీంతో 8 గంటల పాటు హాయిగా ఉండొచ్చు. మీకు ఇంకా చల్లని గాలి కావాలంటే వాటర్ ట్యాంక్‌లో ఐస్ కూడా జోడించవచ్చు.

Tags:    

Similar News