Swiggy UPI: బిర్యానీ లవర్స్‌కు పండగే.. 5 మినిట్స్‌లో ఫుడ్ ఆర్డర్..!

Swiggy UPI: ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ యూపీఐ సేవలను ప్రారంభించింది. ఇప్పుడు 5 సెకన్లలో పేమెంట్ చేయవచ్చు.

Update: 2024-08-14 11:59 GMT

Swiggy UPI

Swiggy UPI: ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన కస్టమర్‌లకు యాప్‌లో పేమెంట్స్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సొల్యూషన్ అయిన Swiggy UPIని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లగ్-ఇన్ సొల్యూషన్, జుస్పే హైపర్‌యూపీఐ ప్లగ్‌ఇన్ ద్వారా అందించబడింది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా Swiggy యాప్‌లో UPI లావాదేవీలను పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ UPI ఇంటిగ్రేషన్ పేమెంట్ ప్రాసెస్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. వినియోగదారులను థర్డ్-పార్టీ UPI యాప్‌లకు వెళ్లకుండా నేరుగా మీ ఆర్డ్ర్‌ను ప్రొసీడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల ట్రాన్సాక్షన్ సమయాన్ని 15 సెకన్ల నుండి కేవలం 5 సెకన్లకు తగ్గించింది. ఇది వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని వినియోగదారులకు అందజేస్తుందని స్విగ్గీ పేర్కొంది.

స్విగ్గీ దాని ఉద్యోగులతో UPIని టెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో దశలవారీగా వినియోగదారులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ జోమాటో తన యుపిఐ సర్వీస్, జోమాటో యుపిఐని ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత స్విగ్గీ తన సొంత యుపిఐని ప్రారంభించింది.

స్విగ్గీ రెవెన్యూ, గ్రోత్ హెడ్ అనురాగ్ పంగనామాముల కొత్త UPI ఫీచర్‌ను ప్రారంభించడం గురించి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మా UPI అనుభవాన్ని మా కస్టమర్‌లకు పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. UPI అత్యంత ప్రాధాన్య చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. వినియోగదారులకు అసమానమైన సౌకర్యాన్ని అందించడానికి ఈ ఫీచర్ Swiggy మిషన్‌తో అలైన్డ్ చేయబడింది. లావాదేవీల ప్రాసెస్‌ను భారీగా సులభతరం చేయడం, చెల్లింపు వైఫల్యాలను తగ్గించడం ద్వారా ఈ ఫీచర్ Swiggyలో వినియోగదారు అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము.

Tags:    

Similar News