Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,100 రూపాయల పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,050 రూపాయలు పలికింది.
Gold Rate Today: బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,100 రూపాయల పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,050 రూపాయలు పలికింది.
బంగారం ధరలు ఇప్పటికీ ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఎంత పెరిగిన ఆల్ టైం రికార్డ్ స్థాయి అవుతుంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.
దీనికి తోడు అమెరికా కూడా సిరియాపై దాడులు ప్రారంభించింది. దీంతో పశ్చిమాసియాలో కల్లోల వాతావరణం ఏర్పడింది. ఈ కారణంగా చెబుతూ ప్రధాన కేంద్రం అయినా పశ్చిమాసియా వాణిజ్యపరంగా సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ఎగుమతులు దిగుమతులపైన ఈ యుద్ధ వాతావరణం ప్రభావం చూపిస్తుంది. . ఇది ప్రపంచ వాణిజ్య రంగానికి దెబ్బగా భావిస్తున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు పెరిగినట్లు అయితే దేశీయంగా పసిడి ధర తొలిసారిగా 80 వేల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. బంగారం ధరలు 80,000 రూపాయల మార్కును ఈ నెల చివరి నాటికి తాకే అవకాశం కల్పిస్తోంది. అంటే దీపావళి, ధన త్రయోదశి నాటికి బంగారం కొత్త గరిష్టాన్ని మనం చూసే అవకాశం ఉంది.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనక దేశీయంగా ఉన్న కారణాల్లో డిమాండ్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇది ఫెస్టివల్ సీజన్ కావడంతో పెద్ద ఎత్తున జనం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గుతాయా అనే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు తగ్గేవరకు బంగారం ధర పెరిగే అవకాశం కల్పిస్తోంది.