PAN Card: మైనర్లు కూడా పాన్‌కార్డు పొందవచ్చు.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..!

PAN Card: మైనర్లు కూడా పాన్‌కార్డు పొందవచ్చు.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..!

Update: 2023-01-07 15:30 GMT

PAN Card: మైనర్లు కూడా పాన్‌కార్డు పొందవచ్చు.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..!

PAN Card: రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్ అనేక ఇతర రకాల ప్రభుత్వ కార్డులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడు మైనర్ల కోసం కూడా పాన్‌కార్డు అప్లై చేయవచ్చు. దీని కోసం పూర్తి చేయవలసిన కొన్ని ప్రత్యేక పనులు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇందుకోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. పాన్ కార్డు నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఆదాయపు పన్నును దాఖలు చేయడానికి పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రం అని అందరికి తెలుసు. దీనిని శాశ్వత ఖాతా సంఖ్య అంటారు. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. మైనర్ కోసం పాన్ కార్డ్ తయారు చేయవలసి వచ్చినప్పుడు పాన్ కార్డ్‌లో మైనర్ సంతకం, ఫోటో ఉండదు.

మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత అప్‌డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే సంతకం, ఫోటో వస్తాయి. పాన్ కార్డు తయారీ ప్రక్రియకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేయడానికి NSDL అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఫారమ్ 49A నింపాలి. ఇక్కడ మైనర్‌కి సంబంధించి కొన్ని పత్రాలని అడుగుతారు. వాటిని సమర్పించాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పుట్టిన తేదీ రుజువు తప్పనిసరి. తర్వాత మైనర్‌కి సంబంధించి పాన్ కార్డు కొద్ది రోజుల్లోనే తయారవుతుంది. కొత్త పాన్ కార్డు చేయడానికి రుసుము 107 రూపాయలు. దీన్ని ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

Tags:    

Similar News