Luggage Insurance: రైలులో జర్నీ చేసేటప్పుడు లగేజీ చోరీకి గురైందా.. పరిహారం ఇలా పొందండి..!

Luggage Insurance: ప్రతిరోజు భారతీయ రైల్వే లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. రోడ్డు, జల, వాయు మార్గాల కంటే చాలామంది రైలులో ప్రయాణించడానికే మొగ్గు చూపుతారు.

Update: 2024-01-12 14:30 GMT

Luggage Insurance: రైలులో జర్నీ చేసేటప్పుడు లగేజీ చోరీకి గురైందా.. పరిహారం ఇలా పొందండి..!

Luggage Insurance: ప్రతిరోజు భారతీయ రైల్వే లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. రోడ్డు, జల, వాయు మార్గాల కంటే చాలామంది రైలులో ప్రయాణించడానికే మొగ్గు చూపుతారు. కారణం ఇందులో తక్కువ మొత్తంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సామాన్యలకు రైల్వే ఒక వరమని చెప్పాలి. అయితే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ లగేజీ ఎవరైనా దొంగిలిస్తే టెన్షన్‌ అవసరం లేదు. ఎందుకంటే దానికి పరిహారం లభిస్తుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రైలు బీమా

మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైలులో ప్రయాణించేటప్పుడు మీ హక్కులు ఏంటో తెలుసుకోవాలి. మీరు టిక్కెట్‌ను బుక్ చేసినప్పుడల్లా మీకు బీమా ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం వల్ల ఈ మొత్తం ప్రయాణానికి మీకు ఇన్సూరెన్స్‌ కవర్‌ ఉంటుంది. ఇందులో రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. రైలులో మీ లగేజీ చోరీకి గురైనా ఈ బీమా ఉపయోగపడుతుంది.

ఒక రూపాయి కంటే తక్కువ

టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో చాలామంది ఈ ఆప్షన్‌ను పట్టించుకోరు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వదిలేస్తారు. అయితే ఈ ఇన్సూరెన్స్‌ ధర ఒక రూపాయి కంటే తక్కువ. అంటే దాదాపు 50 పైసలకు మాత్రమే. దీనివల్ల మీకు ప్రయాణంలో రూ.10 లక్షల బీమా ఉంటుంది. అందుకే ప్రయాణం చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

ఇన్సూరెన్స్‌ పొందాలంటే

ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్‌ పనిచేస్తుందని అందరు అనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే బీమా ఇతర విషయాల్లో కూడా ఉపయోగపడుతుందని తెలుసు. మీరు రైలులో ప్రయాణిస్తుంటే మీ సామాను చోరీకి గురైతే బీమా కంపెనీ నష్టాన్ని భర్తీ చేస్తుంది. IRCTC మీకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. రైల్వేలు ఇప్పటికే ప్రైవేట్ బీమా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్లెయిమ్‌లు చేస్తే పరిహారం చెల్లిస్తాయి.

వస్తువులు చోరీకి గురైనా, ప్రమాదం జరిగినా వెంటనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మీరు రైల్వే వెబ్‌సైట్‌లో లేదా బీమా కంపెనీలో మీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీ టికెట్, ఇతర విషయాల గురించి సమాచారాన్ని అందించాలి. ప్రమాదం జరిగితే బాధితుడి కుటుంబ సభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News