PAN Card Frauds: మీ పాన్‌కార్డుని ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా.. నష్టాన్ని నివారించడానికి ఇలా చేయండి..!

PAN Card Frauds: పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన ప్రభుత్వ ఐడీ కార్డు.

Update: 2023-03-02 05:30 GMT

PAN Card Frauds: మీ పాన్‌కార్డుని ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా.. నష్టాన్ని నివారించడానికి ఇలా చేయండి..!

PAN Card Frauds: పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన ప్రభుత్వ ఐడీ కార్డు. దాదాపు అన్ని పనులకు ఇది ఉపయోగపడుతుంది. రుణం తీసుకోవాలన్నా, పన్ను చెల్లించాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చాలా మంది వ్యక్తులు పాన్ కార్డును తమ వద్దే ఉంచుకుంటారు కానీ పాన్ కార్డ్ మోసానికి సంబంధించి అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి . ఈ పరిస్థితిలో మీ పాన్ కార్డ్ ఏదైనా తప్పు ప్రదేశంలో ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం ముఖ్యం.

ఒక మోసగాడు మీ పాన్ కార్డ్‌ని రుణం తీసుకోవడానికి, క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, తప్పుడు పద్దతిలో ఆభరణాలను కొనుగోలు చేయడానికి, హోటల్ లేదా వాహనాన్ని అద్దెకు తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. మీ పాన్ కార్డ్ తప్పుడు కార్యకలాపాలలో యాక్టివ్‌గా ఉన్నట్లు తేలితే మీరు జైలుకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో పాన్ కార్డును మీరు తప్ప మరెవరూ ఉపయోగించకుండా చేసుకోవాలి.

పాన్ కార్డును ఎవరు ఉపయోగిస్తున్నారో ఎలా తెలుసుకోవాలి..?

దీని కోసం ముందుగా మీరు క్రెడిట్ స్కోర్‌ను చెక్‌ చేయాలి. TransUnion CIBIL, Equifax, Experian, Paytm, Bank Bazaar, CRIF హై మార్క్ వంటి అనేక వెబ్‌సైట్‌ల ద్వారా క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయవచ్చు. దీని కోసం ముందుగా ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. తర్వాత సెర్చ్ బార్‌లో క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి. మీరు ఈ సమాచారాన్ని ఉచితంగా తనిఖీ చేయవచ్చు కానీ కొన్ని వెబ్‌సైట్‌లు వివరణాత్మక క్రెడిట్ స్కోర్ కోసం కొంత డబ్బును వసూలు చేస్తాయి.

వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలను అందించాలి. పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ వంటివి. తర్వాత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీనిని ఎంటర్‌ చేయాలి. తర్వాత క్రెడిట్ స్కోర్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అప్పుడు క్రెడిట్‌ స్కోరుని బట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.

పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి..?

1. ఎవరైనా మీ పాన్‌ను దుర్వినియోగం చేస్తుంటే ముందుగా దానిని గుర్తించాలి.

2. తర్వాత భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ అయాకార్ సంపర్క్ కేంద్రం (ASK) ద్వారా పాన్ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

3. దీని కోసం ముందుగా TIN NSDL ఎంపికకు వెళ్లాలి.

తర్వాత కస్టమర్ కేర్ విభాగానికి వెళ్లాలి.

4. డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి ఫిర్యాదులు/ప్రశ్నల ఎంపికపై క్లిక్ చేయాలి.

5. తర్వాత స్క్రీన్‌పై ఫిర్యాదు ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.

6. ఈ ఫారమ్‌ను పూర్తిగా నింపి తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత దానిని సమర్పించాలి.

Tags:    

Similar News