Investing In SIP: సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..!

Investing In SIP: ఈ రోజుల్లో చాలామందికి స్టాక్‌ మార్కెట్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ పై అవగాహన పెరిగింది.

Update: 2024-04-21 14:00 GMT

Investing In SIP: సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..!

Investing In SIP: ఈ రోజుల్లో చాలామందికి స్టాక్‌ మార్కెట్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ పై అవగాహన పెరిగింది. అందరూ వీటిలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, బిజినెస్‌ చేసేవారు, స్వయం ఉపాధి పొందేవారు ఎక్కువగా ఉంటున్నారు. సిప్‌ ద్వారా మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. అందుకే వీటిలో ఇన్వెస్ట్‌ చేసేముందు 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

ముందుగా సెర్చ్‌ చేయండి

సిప్‌ని ప్రారంభించే ముందు రకరకాల మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ గురించి తెలుసుకోవడం అవసరం. లేదంటే వాటి గురించి అవగాహన ఉన్న సలహాదారు నుంచి సమాచారం సేకరించవచ్చు. దీనివల్ల మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు నష్టం రాకుండా ఉండేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. తర్వాత మాత్రమే సిప్‌ని ప్రారంభించాలి.

చిన్న మొత్తంలో పెట్టుబడి

ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ముందుగా చిన్న మొత్తంతో ప్రారంభించాలి. ఒకవేళ భారీ మొత్తంతో సిప్‌ని ప్రారంభించినట్లయితే ఒకేసారి మార్కెట్‌ తగ్గితే చాలా నష్టపోతారు. దీంతో పాటు భవిష్యత్‌లో ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొంటే పెద్ద మొత్తంతో సిప్‌ని కొనసాగించడం కష్టమవుతుంది. ప్రారంభంలో 2 లేదా 3 వేలతో సిప్‌ ప్రారంభించవచ్చు.

సడెన్‌గా సిప్‌ ఆపవద్దు

సిప్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత సడెన్‌గా ఆపవద్దు. ఇన్వెస్టర్లు మొదట ఉత్సాహంగా ప్రారంభిస్తారు. కానీ మాంద్యం, మార్కెట్ క్షీణతను చూసిన తర్వాత వెనుదిరుగుతా రు. ఇలా చేయడం వల్ల నష్టపోతారు. మాంద్యం సమయంలో ఓపికగా ఉండాలి. కోలుకున్న తర్వాత డబ్బును విత్‌ డ్రా చేసుకోవడం ఉత్తమం.

లక్ష్యాన్ని సెట్‌ చేసుకోవాలి

మీరు ఎల్లప్పుడూ సిప్‌ వంటి పెట్టుబడులను ఒక లక్ష్యంతో ప్రారంభించాలి. పిల్లల వివాహం, విద్య లేదా రిటైర్మెంట్‌ కోసం ప్లాన్ చేయాలి. ఇది మీ మనస్సును స్పష్టంగా ఉంచుతుంది. ఆ పనికి ఎంత డబ్బు అవసరమో ఆలోచనతో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు.

Tags:    

Similar News