Indian Railway: రైలు ప్రయాణం ఇక మరింత సులభం.. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు!
Indian Railway: ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీల కోసం రైల్వే అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Indian Railway: రైలు ప్రయాణం ఇక మరింత సులభం.. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు!
Indian Railway: ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీల కోసం రైల్వే అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారి ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే రైల్వే శాఖ మహిళల కోసం తాజాగా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో తెలుసుకుందాం.
మహిళల కోసం ప్రత్యేక సౌకర్యం
రైల్వే శాఖ 45 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగ ప్రయాణికులు, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా లోయర్ బెర్త్‌లను (కింది సీట్లు) రిజర్వ్ చేస్తుంది. మహిళలు అప్పర్ బెర్త్‌పై (పై సీటు) ఎక్కే ఇబ్బందిని నివారించడానికి ఈ ఏర్పాటు చేసింది. ఇదే విధంగా గర్భిణీ స్త్రీలు, దివ్యాంగ ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రైల్వే ఆటోమేటెడ్ టికెటింగ్ సిస్టమ్ ఈ ప్రత్యేక కేటగిరీల ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌ను కేటాయిస్తుంది. వారు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సమయంలో దానిని ఎంచుకోకపోయినా సరే ఈ సౌకర్యం లభిస్తుంది.
భారతీయ రైల్వే ప్రతి కేటగిరీ బోగీలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసింది. స్లీపర్ క్లాస్ (SL)లో ప్రతి కోచ్‌లో 6-7 సీట్లు లోయర్ బెర్త్‌లుగా రిజర్వ్ చేయబడి ఉంటాయి. థర్డ్ ఏసీ (3AC)లో 4-5 సీట్లు ప్రత్యేక ప్రయాణికుల కోసం రిజర్వ్ చేస్తారు. సెకండ్ ఏసీ (2AC)లో 3-4 సీట్లు లోయర్ బెర్త్‌లుగా అందుబాటులో ఉంటాయి.
ఆటోమేటెడ్ సిస్టమ్
రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో ఒక ఆటోమేటెడ్ అల్గోరిథాన్ని చేర్చారు. ఇది టికెట్ బుకింగ్ సమయంలో వయస్సు, కేటగిరీ ఆధారంగా లోయర్ బెర్త్‌ను కేటాయిస్తుంది. సీనియర్ సిటిజన్, దివ్యాంగుడు లేదా గర్భిణీ స్త్రీ ప్రయాణికుడు తమ వివరాలను నమోదు చేసిన వెంటనే, రైల్వే సిస్టమ్ వారికి ప్రాధాన్యత క్రమంలో లోయర్ బెర్త్‌ను కేటాయిస్తుంది. ఈ ప్రత్యేక సౌకర్యాల ద్వారా రైల్వే మహిళలు, సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం, సౌకర్యవంతంగా మార్చడానికి కృషి చేస్తోంది. రైలు ప్రయాణీకులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది.