Credit Score: లోన్ తీసుకోకుంటే క్రెడిట్ స్కోరు ఉండదు.. కానీ ఈ విషయాలు చెక్ చేయాల్సిందే..!
Credit Score: మీకు అర్జంట్‌గా లోన్ అవసరమైతే బ్యాంకుకు వెళ్లడం కాదు ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి.
Credit Score: మీకు అర్జంట్‌గా లోన్ అవసరమైతే బ్యాంకుకు వెళ్లడం కాదు ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఫైనాన్షియల్ సంస్థ అయినా సరే మీ క్రెడిట్ స్కోరు చెక్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. అయితే కొంతమంది తాము ఏ లోన్ తీసుకోము తమకు క్రెడిట్ స్కోరు గురించి అవసరం లేదనుకుంటారు. ఇలా ఆలోచిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అది ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం.
నిజానికి మీకు లోన్లు తీసుకునే అవసరం లేదా కావొచ్చు కానీ జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మీకు ఏ అవసరం ఉండదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఎంచుకున్న లక్ష్యాల కోసం లోన్లు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ఉదాహారణకు ఇళ్లు కొనడం, వెహికల్ తీసుకోవడం, స్టడీ లోన్ ఇలాంటివి అవసరమవుతాయి. అప్పుడు మీకు కచ్చితంగా క్రెడిట్ స్కోరు 750 పైనే ఉండాలి.
లేదంటే అధిక వడ్డీలకు లోన్లు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. మీరు సొంతంగా క్రెడిట్ స్కోరును చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు మీ స్కోరును చెక్ చేస్తే లోన్ కోసం అప్లై చేసినట్లు అవుతుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుందని గుర్తుంచుకోండి.
నిజానికి లోన్ తీసుకోకుంటే మీకు ఎలాంటి క్రెడిట్ స్కోరు ఉండదు. కానీ పెరిగిన టెక్నాలజీ వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ పేరుపై లోన్లు, అప్పులు నమోదవుతాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు అవకాశం కోసం ఎప్పుడు ఎదురుచూస్తే ఉంటారు. అందుకే అప్పుడప్పుడు క్రెడిట్ స్కోరు చెక్ చేస్తూ ఉండాలి.
దీనివల్ల మీ పేరుపై ఏమైనా లోన్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది. మీ క్రెడిట్ స్కోరు పెరిగిందా లేదా అనే విషయాలు గమనించవచ్చు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి క్రెడిట్ స్కోరు అనేది మీరు ఈఎంఐ లాంటి ఒక ఇన్స్టాల్మెంట్ లేట్‌గా కట్టిన వంద పాయింట్లు పడిపోతుంది. అదే వంద పాయింట్లను పెంచుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అది సంవత్సరాలలో ఉంటుంది.