Business Idea: ఈ పంట సాగు చేస్తే ఏడాదికి లక్షల ఆదాయం.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..!

Business Idea:ఈ రోజుల్లో కొంతమందికి ఉద్యోగం చేయడమంటే ఇష్టం. మరికొంతమందికి వ్యవసాయం చేయడం అంటే ఇష్టం.

Update: 2024-02-19 11:00 GMT

Business Idea: ఈ పంట సాగు చేస్తే ఏడాదికి లక్షల ఆదాయం.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..!

Business Idea: ఈ రోజుల్లో కొంతమందికి ఉద్యోగం చేయడమంటే ఇష్టం. మరికొంతమందికి వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ఇంకొందరు తక్కువ సమయంలో బిజినెస్‌ చేసి బాగా సంపాదిస్తారు. ఇప్పుడు మూడో కేటగిరీకి చెందిన వ్యక్తుల కోసం ఒక బిజినెస్‌ ఐడియా బాగా పాపులర్‌ అవుతోంది. అదే నిమ్మగడ్డి సాగు చేయడం. ఈ వ్యాపారం చేయాలంటే ముందుగా అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఉండాలి. పెట్టుబడి కోసం దిగులు చెందనవసరం లేదు. ఎందుకంటే పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు. లెమన్‌ గ్రాస్‌ ద్వారా ఏడాదికి మూడు సార్లు ఆదాయం పొందవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లెమన్‌గ్రాస్ ఆకులు, సుగంధ కాండాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మంచి నీటి పారుదల, 6 నుంచి 7 మధ్య pH స్థాయి ఉన్న నేల సరిపోతుంది. నిమ్మగడ్డి సాగుకు వేడి, తేమతో కూడిన వాతావరణం బాగుంటుంది. 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. నిమ్మగడ్డి సాగును ప్రారంభించే ముందు మార్కెట్‌లో ఉన్న పోటీదారుల గురించి అధ్యయనం చేయాలి. ఈ పంటకు శాశ్వత, లాభదాయకమైన మార్కెట్‌ను కనుగొనడం చాలా ముఖ్యం. ఎండలు, మంచి వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నిమ్మగడ్డి సాగు బాగుంటుంది.

ఈ రోజుల్లో మార్కెట్‌లో నిమ్మగడ్డికి డిమాండ్ బాగా పెరిగింది. నిమ్మకాయకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నా దిగుబడి తక్కువగా ఉంటుంది. నిమ్మగడ్డిని పండించాలంటే ముందుగా పొలం గట్లను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఈ గట్లలో నిమ్మగడ్డి విత్తనాలను చల్లాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి నీరు పెట్టడం అవసరం. దీని కారణంగా దిగుబడి పెరగుతుంది. తర్వాత దానిని కత్తిరించి విక్రయించవచ్చు. సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు పంట చేతికస్తుంది.

లెమన్‌గ్రాస్ వాడకం

లెమన్‌ గ్రాస్‌కు రేటు, డిమాండ్‌ రెండూ ఎక్కువే. రెస్టారెంట్లు, ఆహార పానీయాల ఇండస్ట్రీలలో దీని ఆకులకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. లెమన్ గ్రాస్ ఆకులను ఎండబెట్టి టీ ఆకులతో కలుపుతారు. నిమ్మగడ్డి నూనెను మార్కెట్‌లో విక్రయిస్తారు. దీని నూనెను ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మగడ్డి సాగుతో ప్రతి సంవత్సరం లక్షలు సంపాదించవచ్చు. ఇందులో లాభం బాగా ఉంటుంది. కానీ కొద్దిగా శ్రమించాల్సి ఉంటుంది. లెమన్ గ్రాస్ ఆయిల్‌ను మార్కెట్‌లో లీటరు రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.

Tags:    

Similar News