Gold Rate Today: సెప్టెంబర్ 25 బుధవారం నేటి బంగారం ధరలు..70వేలు దాటిన పసిడి ధర
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు ఈరోజు కూడా పెరిగాయి. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ. 70.010కి చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 70,000గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. ప్రస్తుతం రూ. 7,0,100గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 7,001గా ఉంది.
మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగింది. రూ. 76,370గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 76,360గా ఉంది. వందగ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7,63,700గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,637గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,160గాను, 24క్యారెట్ల బంగారం ధరరూ. 76,520గా ఉంది. కోల్ కతా, ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,010గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 76,370గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ఇక వెండి ధరల విషయానికి వస్తే..దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9280గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. రూ. 92,800వద్ద కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 92,900గా ఉండేది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 97,900 పలకుతుంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 92,800, బెంగళూరులో రూ. 87,100గా ఉంది.