Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధరలు నిన్న గురువారంతో పోల్చి చూస్తే నేడు శుక్రవారం మళ్లీ పెరిగాయి. నేడు నవంబర్ 8వ తేదీన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79650 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72800 రూపాయలుగా ఉంది.
బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు 500 రూపాయలు పెరిగింది. అయితే బంగారం ధరలు గడచిన రెండు రోజుల్లోనే 2000 రూపాయల వరకు తగ్గు ముఖం పట్టాయి. ఆ తర్వాత బంగారం ధర ఇప్పుడు మళ్ళీ పెరగడం ప్రారంభించింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మార్కెట్లో వచ్చినటువంటి ర్యాలీతో, మరోసారి ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు.
దీంతో నేడు బంగారం మళ్లీ పెరిగింది. అయితే ప్రస్తుతం అమెరికాలో బంగారం ధర ఒక ఔన్సు 2700 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించడంతో బంగారం ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఇందుకు ప్రధాన కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల యూఎస్ ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై రాబడి తగ్గుతుంది.
సాధారణంగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టి. ఆ బాండ్లపై వచ్చే రాబడిని ఆదాయంగా పొందుతారు. అయితే ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గడంతో ట్రెజరీ బాండ్ల పైన రాబడి కూడా తగ్గుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని సురక్షితమైన సాధనంగా భావించే బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఇది కూడా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది.
అటు అమెరికా స్టాక్ మార్కెట్లలో కూడా పెద్ద ఎత్తున నష్టాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా బంగారం ధరలు పెరగడానికి మరోసారి ఊతం లభించింది. బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులు ఉసూరుమంటున్నారు.