Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,710 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,750 పలికింది.
పసిడి ధరలు భారీగా పెరగడానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా ఎన్నికల్లో కమలాహరిస్, డోనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వార్తలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.
దీంతో పెట్టుబడి పరంగా లాభదాయకమైన బంగారం వైపు ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి తోడు ధన త్రయోదశి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేస్తారు ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదం చేస్తోంది.
దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) నెమ్మదిగా ఆర్థిక వృద్ధిని పెంచడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ తగ్గుదల రేట్లు బాండ్ల వంటి సాంప్రదాయ పెట్టుబడులను తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి. దీని వలన బంగారం ధరలు పెరుగుతున్నాయి.
అటు అమెరికాలో ఆర్థిక బలానికి సంబంధించిన సంకేతాలు ఉన్నప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ఇతర ఆస్తుల కంటే ఆకర్షణీయంగా మారుతుంది. ఇదిలా ఉంటే దేశీయంగా ఉన్న ఇతర కారణాల వల్ల కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ధన త్రయోదశి సందర్భంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేవారు పెద్ద మొత్తంలో ఈ సంవత్సరం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంది.
కనుక బంగారు ఆభరణాల షాపింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా బరువు విషయంలోనూ, నాణ్యత విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడిన పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.